Home » Nation » LotusInBengal: అమిత్ షా మార్కు స్ట్రాటజీ .. మమత వుక్కిరి బిక్కిరి

LotusInBengal: అమిత్ షా మార్కు స్ట్రాటజీ .. మమత వుక్కిరి బిక్కిరి

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

పశ్చిమ బెంగాల్లో( West Bengal) బిజెపి సత్తా చాటాలని చూస్తోంది. కానీ మమతా బెనర్జీ సైతం అదే దూకుడుతో ముందుకు సాగుతున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్లో మమతా వర్సెస్ బిజెపి అన్నట్టు పరిస్థితి మారుతోంది. దేశ రాజకీయాల్లో బిజెపి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతి రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తోంది. ఎక్కడెక్కడ ఓటమి ఎదురవుతుందో.. అటువంటి చోట నిలదొక్కుకొని అధికారంలోకి వస్తోంది. ఈ పుష్కర కాలంలో బిజెపి ఓటములను గెలుపుగా.. గెలుపులను భారీ విజయాలుగా మార్చుకుంటూ దూసుకెళ్తోంది.

 గత ఏడాది బీహార్( Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది ఎన్డీఏ. అందుకే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పై ఫుల్ ఫోకస్ చేసింది. గత రెండుసార్లు వెస్ట్ బెంగాల్లో సీఎం పీఠాన్ని అధిరోహించాలని బిజెపి తహతహలాడింది. కానీ అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. అయితే ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించింది బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ. అందుకే పశ్చిమ బెంగాల్లో తన జైత్రయాత్రను కొనసాగించాలని చూస్తోంది.

 * స్పెషల్ ఫోకస్..

 పశ్చిమ బెంగాల్ పై బిజెపి స్పెషల్ ఫోకస్ చేసింది. తృణముల్ కాంగ్రెస్ అధికార పీఠాన్ని దించేలా రాజకీయ వ్యూహాలు రూపొందిస్తోంది. ఇక్కడ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. క్షేత్రస్థాయిలో మమతా బెనర్జీ పట్టు సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఆ పట్టు సడలిపోయే ప్రమాదం ఉందన్న అంచనాలు ఉన్నాయి. 2021 ఎన్నికల్లో గెలవాలని బిజెపి సర్వశక్తులు వడ్డింది. కానీ త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ ముందు బిజెపి నిలబడలేకపోయింది. ఈసారి మాత్రం మమతా బెనర్జీని ఎలాగైనా అధికారం నుంచి దూరం చేయాలని చూస్తోంది.

 * దొంగ ఓట్లు తొలగింపు 

 అయితే పశ్చిమ బెంగాల్ లో చొరబాట్ల దారుల ఓట్లతోనే ఆమె సునాయాస విజయాన్ని దక్కించుకుంటున్నారన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షలకు పైగా దొంగ ఓట్లను ఈసారి తొలగించే ప్రయత్నం చేసింది బిజెపి. మొత్తం 54 లక్షల వరకు దొంగ ఓట్లు ఉన్నాయని తేల్చింది. రిగ్గింగ్ నియోజకవర్గాలపై సైతం ఫుల్ ఫోకస్ పెట్టింది. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించి త్రుణముల్ కాంగ్రెస్ హవాకు బ్రేక్ చేయాలని చూస్తోంది.

 * చేరికలు పెరిగి..

 బిజెపిలో చేరికలు కూడా పెరిగాయి. గతంలో కాంగ్రెస్, సిపిఐ పార్టీల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కీలక నాయకులుగా ఎదిగినటువంటి వారి పిల్లలను బిజెపిలో చేర్చుకుంటుంది. రాజకీయంగా వారికి అవకాశాలు కల్పించి బలపడాలని చూస్తోంది. ఈ విధంగా స్ట్రాటజీలను ఉపయోగించి బిజెపి పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Share to...