Home » Nation » Usnews: అమెరికాను ఏకాకి చేస్తేనే ప్రపంచ దేశాలకు ప్రశాంతత!

Usnews: అమెరికాను ఏకాకి చేస్తేనే ప్రపంచ దేశాలకు ప్రశాంతత!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

ఆయనకు హద్దు పద్దు లేకుండా పోతోంది. లెక్క పత్రం లేకుండా పోతోంది. దేశాలను ఆక్రమిస్తానంటాడు. ఐక్యరాజ్యసమితికే సవాల్ చేస్తున్నాడు. ప్రత్యామ్నాయంగా ఓ బోర్డు ఏర్పాటు చేసి దానికి తానే సారథ్యం వహిస్తానని చెబుతున్నాడు. రష్యా దగ్గర ఆయిల్ ఉంటే ఖబడ్దార్ అంటూ సుంకాలు విధిస్తున్నాడు. ఇలా దూకుడు ప్రదర్శిస్తూ ప్రపంచానికే సవాల్ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ? తెలియాలంటే లెట్ వాచ్ దిస్ స్టోరీ.

* వణికిపోతున్న ప్రపంచ దేశాలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్( Donald Trump ).. ఇప్పుడు ఈ మాట చెబితేనే ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఆయన లీలలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలియక చేస్తున్నాడో.. తెలుసుకోవాలని చేస్తున్నాడో అర్థం కాని స్థితిలో ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న ఆలోచన ఆయనలో కనిపిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేది ఎవరు? అడ్డుపడేది ఎవరు? ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఎదురవుతున్న ప్రశ్న ఇదే.

* మారుతున్న సంబంధాలు..
అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పాలనలో అంతర్జాతీయ సంబంధాలు మారుతున్నాయి. ఆయన పేరు చెబితేనే అగ్రరాజ్యాల అధినేతలు ఆలోచనలో పడిపోతున్నారు. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా అమెరికా ఉండాలన్న ఆలోచన బయటపడుతోంది. అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయాలు.. ఇలా ప్రతి రంగంలోనూ తన మార్కు ఉండాలని ట్రంప్ పరితపిస్తున్నారు. అందుకే అమెరికా నిర్ణయాలు సంచలనాలుగా మారుతున్నాయి. మిగతా దేశాలు సంక్షోభంలో కోరుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా భారీ టారీఫ్ లు, చిన్న దేశాల ఆక్రమణలపై చేస్తున్న వ్యాఖ్యలు, ఐక్యరాజ్యసమితి( United Nation ) లెక్కచేయకపోవడం వంటివి.. యావత్ ప్రపంచం పై ప్రభావం చూపుతున్నాయి.

* పన్నుల బాదుడు..
పన్నుల బాదుడు పైనే ట్రంప్ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. ఆయన ప్రధాన ఆయుధం కూడా టారిఫ్. చివరకు మిత్ర దేశాలపై కూడా భారీగా సుంకాలు విధిస్తున్నారు. రష్యా( Russia) నుంచి ఏ దేశం ఆయిల్ కొన్నా.. ఇతర దేశాలతో వ్యాపారం చేసినా.. వాణిజ్య లోటు ఎక్కువగా ఉన్నా.. తన మాట వినకపోయినా.. అదనపు సుంకాలు అధిక స్థాయిలో తప్పవన్న హెచ్చరికలు ప్రపంచ దేశాలకు పంపిస్తున్నారు. తాజాగా గ్రీన్ ల్యాండ్ విషయంలో తనకు మద్దతు తెలపని దేశాలపై 10% అదనపు సుంకాలను విధిస్తున్నట్లు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సంచలనం గా మారింది. ముఖ్యంగా డెన్మార్క్ తో పాటు ఐరోపా దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్ పై అదనపు సుంకాలను ప్రకటించారు. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే అప్పటికి ఆ దేశాలు తన రూట్లోకి రాకపోతే.. జూన్ నుంచి 25 శాతానికి సుంకాలను పెంచుతానని హెచ్చరించారు. అంటే తన నిర్ణయాలను ప్రశ్నించే దేశాలపై ఆయన ఉక్కుపాదం మోపినట్టే కదా.

* ఐక్యరాజ్యసమితి పై విమర్శలు..
ప్రపంచ శాంతికి ఏర్పాటు చేసినదే ఐక్యరాజ్యసమితి. రెండో ప్రపంచ యుద్ధం( world second battle ) తర్వాత ఆ పరిస్థితులు రాకుండా ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేశారు. కానీ అదే ఐక్యరాజ్యసమితిపై ట్రంప్ తరచూ విమర్శలు చేస్తున్నారు. అమెరికా ఇచ్చే భారీ నిధులతో ఇతర దేశాలు ప్రయోజనం పొందుతున్నాయని వాదిస్తున్నారు. అది ఒక చర్చా వేదిక మాత్రమేనని.. ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో విఫలం అయిందని ఆరోపిస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా బోర్డ్ ఆఫ్ పీస్ అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చి దానికి తానే సారథ్యం వహించాలని ట్రంప్ భావిస్తున్నారు.

* దెబ్బతింటున్న అంతర్జాతీయ సమన్వయం..
అంతర్జాతీయ సమన్వయాన్ని దెబ్బతీసేలా ట్రంప్ వ్యవహారం ఉంది. వెనిజుయెలా( Venezuela) అధ్యక్షుడిని బంధించడం, ఇరాన్ పై దాడులు చేస్తామని హెచ్చరించడం, గ్రీన్ ల్యాండ్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పడం వంటి ప్రకటనలు కలకలం రేపుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనూ.. నాతో కూటమి విషయంలోనూ ట్రంప్ అనుసరిస్తున్న తీరు.. ఐరోపా దేశాలను భయపెడుతోంది. ఆయనను ఇలా వదిలేస్తే ప్రపంచం మొత్తం ఆయన నియంత్రణలోకి వెళ్ళిపోతుందన్న భయం వెంటాడుతోంది.

* ట్రంప్ దూకుడుకు బ్రేకులు వేయాల్సిందే..
అయితే ఇంతవరకు అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగింది. ఎన్నో రకాల ఆధిపత్యాలను ప్రదర్శించింది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితి మితిమీరుతోంది. ట్రంప్ తన లిమిట్లో తాను ఉండడం లేదు. కొత్త లిమిట్స్ దాటుతున్నాడు కూడా. దీనికి చెక్ పెట్టకపోతే మాత్రం ప్రపంచ దేశాలు ఇబ్బందుల్లో పడతాయి. దౌత్య పరమైన పరిధులు, అంతర్జాతీయ నియమ నిబంధనలను క్రాస్ చేస్తున్నాడు ట్రంప్. ట్రంప్ దూకుడుకు బ్రేకులు వేయకుంటే మాత్రం ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందుల్లో పడడం ఖాయం. అంతర్జాతీయంగా అమెరికాను ఏకాకి చేస్తేనే ఫ్రమ్ దారిలోకి వస్తాడు. అయితే ఇది ఆచరణలో అత్యంత క్లిష్టమైనది కూడా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యం కొనసాగుతోంది. అమెరికాతో వ్యాపారం అంటేనే ఇప్పుడు ఒక సాహసంతో కూడుకున్న పని. ఆపై ప్రపంచంలో చాలా దేశాలు తమ రక్షణ కోసం అమెరికా సైనిక శక్తిపై ఆధారపడి ఉన్నాయి. దానిని సాకుగా చూపి ట్రంప్ రెచ్చిపోతున్నారు.

Share to...