🚆 భారత రైల్వేలో నిశ్శబ్ద విప్లవం – వేగం, భద్రత, ఆధునీకరణ! 🇮🇳
భారతదేశ రైల్వే నెట్‌వర్క్ గత దశాబ్దంలో ఒక మూలపూర్వకమైన మార్పును చూసింది. భారీ స్థాయి ట్రాక్ రీన్యూవల్ & ఆధునీకరణ కార్యక్రమాల ఫలితంగా,
⭐️ ఇప్పుడు భారత రైల్వే నెట్‌వర్క్‌లో దాదాపు 80% ట్రాక్స్ 110 కి.మీ/గం లేదా అంతకంటే ఎక్కువ వేగాన్ని భరించే స్థాయికి చేరుకున్నాయి. ఇది చిన్న విషయం కాదు
🔧 ఈ మార్పు ఎలా సాధ్యమైంది?
✅ పాత ట్రాక్స్ తొలగింపు – కొత్త ట్రాక్స్ అమరిక
దశాబ్దాలుగా ఉపయోగంలో ఉన్న పాత రైల్స్‌ను తొలగించి, అధిక బలం గల కొత్త రైల్స్,
మెరుగైన కాంక్రీట్ స్లీపర్లు అమర్చారు.
✅ మెషినైజ్డ్ ట్రాక్ మెయింటెనెన్స్
మానవ శ్రమపై ఆధారపడే పద్ధతుల స్థానంలో ఆధునిక యంత్రాలతో ట్రాక్ అలైన్‌మెంట్, ఆటోమేటిక్ టాంపింగ్, లెవెలింగ్ ద్వారా ట్రాక్ నాణ్యతను పెంచారు.
✅ భద్రతా ప్రమాణాల్లో భారీ మెరుగుదల
• ట్రాక్ జియోమెట్రీ మానిటరింగ్
• వైబ్రేషన్ & లోడ్ టెస్టింగ్
• ప్రమాదాల అవకాశాన్ని తగ్గించే టెక్నాలజీ
🚄 దీని వల్ల దేశానికి వచ్చిన లాభాలు
✔️ రైళ్ల సగటు వేగం పెరిగింది
✔️ ప్రయాణ సమయం తగ్గింది
✔️ ప్రమాదాల ముప్పు గణనీయంగా తగ్గింది
✔️ ప్రయాణికులకు సాఫీ & సురక్షిత ప్రయాణం
✔️ సరుకు రవాణాలో వేగం – ఆర్థిక వ్యవస్థకు బలం
✔️ ముందు ముందు ఇంకా వేగవంతం అయిన కొత్త కొత్త ఆధునిక రైలు లను ప్రవేశపెట్టచ్చు
📈 ఒక దశాబ్దంలో మార్పు
🔹 2014కు ముందు: 110 kmph సామర్థ్యం గల ట్రాక్స్ శాతం చాలా తక్కువ
🔹 ప్రస్తుతం: భారత రైల్వే నెట్‌వర్క్‌లో 4/5 వంతు ట్రాక్స్ ఇప్పుడు అధిక వేగానికి సిద్ధం
ఇది కేవలం రైళ్ల వేగం పెరగడం కాదు, ఇది భారత మౌలిక సదుపాయాల దృఢ సంకల్పానికి నిదర్శనం, ఇది భవిష్యత్ భారత రవాణా వ్యవస్థకు పునాది 💪
పయి గా ఈ అధునాతనం అయిన పనులన్నీ స్వంత స్వదేశీ శాంకేతికతో పూర్తి చేసినవే.
— ఉపద్రష్ట పార్ధసారధి



