Amit Shah: లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆర్ఎస్ఎస్ భావజాలం వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకూడదని భారతదేశంలో ఏదైనా చట్టం రూపొందించబడిందా అని ప్రశ్నించారు.
ఈ దేశ ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారని.. ఈ దేశ హోంమంత్రి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారని స్పష్టం చేశారు. ప్రజాతీర్పుతో చట్టసభల్లోకి వచ్చామని.. కాంగ్రెస్ నేతల దయ వల్ల కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం చనిపోవడమే ఆర్ఎస్ఎస్ భావజాలమని అమిత్ షా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్ఎస్ఎస్ భావజాలం ఒక్కమాటలో#IndiaSupportsSIR pic.twitter.com/Hrq7Z9ytOs
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) December 15, 2025



