Home » Nation » UnionBudget: స్వేచ్ఛా వాణిజ్యమే బడ్జెట్ లక్ష్యం

UnionBudget: స్వేచ్ఛా వాణిజ్యమే బడ్జెట్ లక్ష్యం

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

ఏఐ ఆధారిత సంస్కరణలకు పెద్దపీట

ఎగుమతులపై ఆధారపడడం లేదని చెబుతునే అవే లక్ష్యంగా ప్రపంచ మార్కెట్లతో భారత్ ను అను సంధానం చేసే దిశగా బడ్జెట్ రూపొందించినట్లు కేంద్రం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారాం ప్రకటించడం విశేషం. సాంకేతికతను అందిపుచ్చుకుని సంస్కరణ దిశగా దేశాన్ని తీసుకువెళ్లాడమే లక్ష్యం గా పేర్కొన్నారు. ఆదివారం పార్లమెంటులో తొమ్మిదో సారి జాతీయ బడ్జెట్ రూ.53,47,315 కోట్లతో ప్రవేశపెట్టారు.దీనిలో రెవెన్యూ లోటు రూ.5,92,344 కోట్లు గా పేర్కన్నారు. ఈ బడ్జెట్ ద్రవ్యలోటును నియంత్రిస్తుందన్నారు. 7 శాతం గ్రోత్ రేటుతో ప్రపంచంలో మూడో ఆర్ధిక వ్యవస్ధగా అభివృద్ధి దిశగా పయనిస్తున్నదన్నారు.నిర్మాణాత్మక సంస్కరణలతో గ్లోబల్ మార్కెట్ తో పోటీ పడేందుకు భారత్ ను సిద్దం చేస్తామని, 2026-27 కేంద్ర బడ్జెట్ సంస్కరణల బడ్జెట్ గా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారాం అభివర్ణించారు.ప్రజల ఆశలను అందుకోవడమే లక్ష్యంగా రూపొందించినట్లు పేర్కొన్నారు.”సంస్కరణలతో కూడిన మంత్రం” ఇది అని వ్యాఖ్యానించారు.వికసిత్ భారత్ లో యువత ఆకాంక్షలు నెరవేరేందందుకు ముందుకు సాగుతామన్నారు. మూడు కర్తవ్యాలతో బడ్జెట్ రూపకల్పన చేసినట్లు తెలిపారు.నిర్మాణాత్మక సంస్కరణలతో ఈ కర్తవ్యాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు. సమ్మిళిత ఆర్ధిక అభివృద్ధి మొదటి కర్తవ్యమన్నారు.ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం,సబ్ కా సాత్ ,సబ్ కా వికాస్ మిగిలిన రెండు కర్తవ్యాలు గా పేర్కొన్నారు. ఏఐ, క్వాంటమ్ సాంకేతికత సహాయంతో కొత్త భారత్ నిర్మాణం దిశగా అడుగులు పడతాయన్నారు 2047 నాటికి లక్ష్యాల సాధన దిశగా పయనిస్తున్నామన్నారు.ఇది యువ శక్తి బడ్జెట్ అన్నారు.లక్ష సాధనకు ఆరు రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టిన్నట్లు పేర్కొన్నారు.రూ.10 వేల కోట్లతో బయో ఫార్మా హబ్ గా భారత్ ను తీర్చి దిద్దాలని నిర్ణయించామని తెలిపారు.అలాగే సెమీ కండెక్టర్ కు రూ.40వేలకోట్లు కేటాయించామన్నారు.హై స్పీడ్ రైల్ కారిడార్ ఢిల్లి,వారణాశి,ముంబై,పూనే,హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుమధ్య అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.అలాగే రేర్ ఎర్త్ కారిడార్ కా కేరళ,ఏపీ,ఒడిసా, తమిళనాడు లను అభివృద్ధి చేస్తామన్నారు.చిన్న,మధ్యతరగతి నగరాల ఇన్ ఫ్రా అభివృద్ధి కి చర్యలుచేపడతామన్నారు,మెడికల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా మూడు ఆలిండియా ఆయుర్వేద కళాశాలల స్థాపన చేయనున్నామని తెలిపారు. విద్యా,వైద్యానికి టీసీఎస్ 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించామన్నారు.ఒడిసాలో నేషనల్ వాటర్ వే కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు.కంటైనర్ ఉత్పాదిక పెంచడానికి రూ.10 వేలకోట్లుకేటాయించామన్నారు. రేర్ ఎర్త్ మైనింగ్ ద్వారా ఖనిజాల తవ్వకాల ఉత్పాదికత పెరిగే ప్రణాళిక రూపొందించామన్నారు.టెక్స్ టైల్ అభివృద్ధికి మెగా పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు.2025 ఏప్రిల్ 1 వతేదీనుంచికొత్తపన్నువిధానం అమలులోకి వచ్చిందన్నారు.ఆదాయ పన్నుచెల్లింపులు, ఐటీ రిటర్న్ సరళీకరణ చేశామన్నారు.సామాన్యుడు సమర్పించేలా నిబంధనలు సడలించామన్నారు.జులై 31 వరకూ ఐటీ రిటర్న్స్ అందుబాటులో ఉంచుతామన్నారు.మోటార్ యాక్సిడెంట్స్ చెల్లింపులపై పన్ను సడలించామన్నారు.ఆదాయపన్ను పరిమితిలోమార్పులేదన్నారు.కార్పొరేట్ ,ఐటి స్లాబ్ ల్లో కూడా మార్పు లేదన్నారు ఆర్ధిక మంత్రి.విదేశీ పర్యటనలు ప్యాకేజీ లకు టీసీఎస్ 5 నుంచి 2 శాతానికి తగ్గించామన్నారు.నేషనల్ హస్పటాలిటీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలకు షీ మార్ట్స్ఏర్పాటు కు ప్రొత్సాహం ఇస్తామన్నారు. 20 వాటర్ వే కారిడార్స్ ద్వారా జలమార్గాలకు ప్రాముఖ్యత అందిస్తామన్నారు.మెడికల్ హెడ్స్ తో ఉపాధికల్పన పెరుగుతుందన్నారు.ఐదు రీజనల్ మెడికల్ హెడ్స్ ఏర్పాటు చేస్తామన్నారు.కొబ్బరి,కాజు పరిశ్రమలకు చేయూత ఇస్తామన్నారు.క్లౌడ్ సర్వీసులకు 2047 వరకూ వెసులుబాటు కలిగిస్తాయి న్నారు.విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్ టైం స్కీం ప్రవేశ పెడుతున్నారన్నారు,జీడీపీలో ద్రవ్య లోటు తగ్గిస్తామని2021-22 లో ఇచ్చిన హామీ నెరవేర్చామన్నారు.ఏఐ సాంకేతికతో విద్యార్ధుల,రైతుల భవిష్యత్తుకు బాటలు వేసే ప్రణాళిక రూపొందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.ప్రతి జిల్లాలో మహిళా వసతిగృహాలు నెలకొల్పుతామన్నారు.ఫారిన్ ఫ్రెండ్లీపేరుతో ఫెమాలో భారీ మార్పులు తెస్తున్నామన్నారు. విదేశీయాత్రలపైపన్నులు తగ్గింపు చర్యలు అమలులోకి రానున్నాయి.బయో ఫార్మా రంగం లో పరిశోధనలు వేగవంతం చేసి రూపురేఖలు మార్చుతాయన్నారు.బడ్జెట్లో ఆత్మ నిర్భర్ భారత్ కేటాయింపులు జరిగాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.పేదలు,దళితులు,మహిళలు,యువత కు బడ్జెట్లో పెద్దపీట వేసామని,చిన్న పరిశ్రమల కు ప్రొత్సాహం ఇస్తామన్నారు. నగరాల అభివృద్ధి లో భాగంగా ఏపీకి మేలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ – బెంగుళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ కూడా ఏపీకి ప్రయోజనం కలుగుతుందని వారు తెలిపారు.ఏదిఏమైనా ఈ బడ్జెట్ లో మధ్యతరగతి వర్గానికి పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఆర్ధిక సంస్కరణలు మరింత ముందుకు తీసుకు వెళ్లే చర్యలతో పేద బడుగు,రైతు,నిరుద్యోగ వర్గాలకు ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

ఎం.వి.రామారావు సీనియర్ జర్నలిస్ట్

Share to...