Home » Nation » తెలుగు రాష్ట్రాల నది జలాల వివాదం.. కేంద్రం కీలక నిర్ణయం!

తెలుగు రాష్ట్రాల నది జలాల వివాదం.. కేంద్రం కీలక నిర్ణయం!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

రాష్ట్ర విభజన జరిగి పుష్కరకాలం అవుతోంది. కానీ ఇంకా నది జలాల వివాదం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత అన్ని సమస్యలకు పరిష్కారం చూపింది కేంద్రం. నీటి విభాగంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన తెలంగాణకు నీటి పంపకాల విషయంలో తేడా వస్తే.. వాటి పర్యవసానాలు ఏ పరిస్థితికి దారితీస్తాయో కేంద్రానికి బాగా తెలుసు. అందుకే కేంద్రం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తోంది. తాజాగా జలవివాదాల పరిష్కారానికి జల శక్తి శాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది. రెండు రాష్ట్రాల భావోద్వేగానికి సంబంధించిన అంశం కావడంతో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తోంది కేంద్రం.

 * విభజన హామీల అమలులో జాప్యం..

 రాష్ట్ర విభజన( state dividation) 2014లో జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు మూడుసార్లు ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఇటువంటి తరుణంలో జలవివాదాలు పరిష్కారంలో జాప్యం జరిగితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తోంది కేంద్రం. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు అయింది. అందులో సభ్యులుగా కృష్ణ గోదావరి బోర్డుల చైర్మన్లు, ఇతర ముఖ్య ఉన్నతాధికారులు ఉండనున్నారు. ఏపీ నుంచి నలుగురిని, తెలంగాణ నుంచి మరో నలుగురిని సభ్యులుగా చేర్చారు. ఇలా ఏర్పాటు అయిన కమిటీని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 * పుష్కర కాలంగా వివాదాలు..

 పుష్కర కాలంగా తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు నడుస్తూనే ఉన్నాయి. సహకార సమాఖ్య విధానంతో ఈ సమస్య పరిష్కారానికి అనేక సూచనలు చేసింది. దీనిపై అనేకసార్లు కృష్ణా గోదావరి రివర్ బోర్డులు సమావేశాలు అయ్యాయి కూడా. రెండు రాష్ట్రాల వాదనలు కూడా ఉన్నాయి. గత ఏడాది జూలై 16న ఢిల్లీలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ అధ్యక్షతన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. అయినా సరే సరిహద్దు జలాల వివాదాలు పరిష్కారం కాలేదు.

 * బనకచర్ల ప్రాజెక్టుతో 

 ఇటీవల ఏపీ ప్రభుత్వం( AP government) ఒక కీలక ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. మిగులు జలాల వినియోగానికి గాను బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించారు చంద్రబాబు. కానీ దీనిపై తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రోజురోజుకు ఈ సమస్య జఠిలంగా మారింది. తెలంగాణ సమాజం దీనిని తప్పు పట్టింది. ఈ మిగులు జలాల వినియోగం అనేది రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాస్పద అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ కీలక కమిటీని ఏర్పాటు చేసింది.

Share to...