కల్తీ అనేది సమాజంపై జరుగుతున్న దాడి”: ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల సమావేశంలో సీపీ వీసీ సజ్జనర్
హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, స్వలాభం కోసం కల్తీకి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. కల్తీ అనేది కేవలం వ్యాపారం కాదని, అది సమాజంపై జరుగుతున్న దాడి అని ఆయన అన్నారు. గురువారం బషీర్‌బాగ్‌లోని పాత పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ‘హెచ్-ఫాస్ట్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మాంసం, పాలు, బేకరీ ఉత్పత్తులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి తదితర విభాగాలకు చెందిన సుమారు 200 మంది వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, గత నెల రోజుల వ్యవధిలోనే నగరవ్యాప్తంగా 92 కేసులు నమోదు చేసి, సుమారు 62 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ అక్రమాలకు పాల్పడుతున్న 98 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
HyderabadPolice , VCSajjanar , FoodSafety , Hyderabad , ConsumerAwareness , HFAST , Telangana



