Home » Nation » పాకిస్తాన్ వింత బేరం … అప్పులు తీర్చలేక యుద్ధ విమానాలకు బేరం

పాకిస్తాన్ వింత బేరం … అప్పులు తీర్చలేక యుద్ధ విమానాలకు బేరం

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

పాకిస్తాన్ పై( Pakistan) ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ప్రచారం నడుస్తోంది. అప్పులు తీర్చేందుకు పాకిస్తాన్ చేస్తున్న వింత ప్లాన్ ఆశ్చర్యం వేస్తోంది. తాను చేసిన అప్పులు తీర్చలేక సైనిక సంస్థల వాటాలను రాసిస్తామని చెబుతుండడం హాట్ టాపిక్ అవుతోంది. సాధారణంగా ఏదైనా దేశం అప్పులు చేస్తే.. వడ్డీతో సహా డబ్బు రూపంలో చెల్లిస్తాయి. కానీ పాకిస్తాన్ ఈ విషయంలో సెపరేట్ అన్నట్టు ఆలోచన చేస్తోంది. తన దగ్గర ఉన్న విదేశీ మరకద్రవ్య నిల్వలు అత్తడుగు కు పడిపోవడంతో.. క్యాష్ పేమెంట్స్ బదులుగా యుద్ధ విమానాలను ఇస్తామని చెబుతోంది. దీనిని ఆర్థిక నిపుణులు ఆర్థిక మాయాజాలం గా చెబుతున్నారు.

* చేజేతులా నాశనం
అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ వివాదాస్పద దేశం. అయితే తమ దేశ అభివృద్ధి కంటే శత్రుదేశాల నాశనాన్ని ఎక్కువగా కోరుతోంది. అందుకే ఆర్థికంగా బలపడడం లేదు. ఇతర దేశాల నుంచి భారీగా అప్పులు చేసింది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా నుంచి రెండు బిలియన్ డాలర్ల అప్పు తీసుకుంది. అయితే తన వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోవడంతో వింత ప్రతిపాదన చేసింది. తమ దగ్గర ఉన్న JF 17 థండర్ యుద్ధ విమానాలను సౌదీకి ఇచ్చి.. ఆ మేరకు అప్పులు మాఫీ చేసుకోవాలని చూస్తోంది. చైనా తో కలిసి తయారు చేసిన ఈ విమానాలను విక్రయించడం ద్వారా సుమారు నాలుగు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం కుదుర్చుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. అంటే నగదు చెల్లింపులకు బదులుగా తమ దేశం వద్ద ఉన్న ఆయుధాలు అమ్మేసి అప్పులు తీర్చాలని ఆలోచనలో ఉంది. 

* సైన్యం వాటాలు సైతం..
అయితే తాను చేసిన అప్పులకు గాను పాకిస్తాన్ ప్రభుత్వం ఏకంగా సైన్యానికి చెందిన వ్యాపార సామ్రాజ్యంలో వాటాలను అమ్మకానికి పెట్టింది. పాకిస్తాన్ ఆర్మీ నడిపే హౌజి ఫౌండేషన్ భారీ వ్యాపార సంస్థలోని ఒక బిలియన్ డాలర్ల విలువైన వాటాలను కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఇచ్చేందుకు సిద్ధపడింది అంటే ఏ పరిస్థితికి వచ్చిందో అర్థం అవుతోంది. మార్చి 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రధాని ఇసాక్ దార్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అప్పులు తీర్చలేక దేశపు ఆస్తులను, సైనిక సంస్థలను ఇలా విదేశీయులకు కట్టబెట్టడం ఆ దేశ ఉనికికే ప్రమాదం అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

* ప్రమాదకరమైన వ్యాపారం..
అయితే ఇది పాకిస్తాన్ అప్పుల వ్యవహారమే కాదు. ప్రమాదకరమైన వ్యాపారంగా కూడా మారే అవకాశం ఉంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుధ పరిశ్రమను వ్యాపారంగా మార్చుకోవాలన్న దృక్పథం ఆయనలో కనిపించింది. తమ ఆయుధ పరిశ్రమ లాభాల్లోకి వస్తే తమకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సాయం అక్కర్లేదని చెప్పుకొచ్చారు. అంటే ఇదో వ్యాపారంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్, లిబియా వంటి దేశాలకు కూడా యుద్ధ విమానాలను అమ్మేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. దురదృష్టం ఏమిటంటే దేశంలోని సామాన్య ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఆయుధాల నమ్మకం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఘట్టెక్కిస్తామని అనుకోవడం నిజంగా సంచలనమే.

* దివాలా అంచున ఆర్థిక వ్యవస్థ
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది. దివాలా అంచున ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 410 బిలియన్ డాలర్లు. కానీ ఆ దేశ విదేశీ అప్పు ఏకంగా 92 మిలియన్ డాలర్లకు చేరుకుంది. తగినంత ఉత్పాదకత లేకపోవడం, పన్ను ఆదాయం లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది పాకిస్తాన్. అందుకే అక్కడ నుంచి విదేశీ సంస్థలు సైతం వైదొలుగుతున్నాయి. అప్పులు తీర్చేందుకు పాకిస్తాన్ పడరాని పాట్లు పడుతోంది. నగదుకు బదులుగా యుద్ధ విమానాలు, ఆర్మీ షేర్లు ఇవ్వడం ఆ దేశానికి ప్రమాదకరం. కానీ ఆర్థికంగా బయటపడేందుకు మరో మార్గం లేదు. దేశ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇది సరైన మార్గం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ పాకిస్తాన్ వినే పరిస్థితిలో లేదు.

Share to...