Home » Nation » Bjpnews : ఠాక్రేలు కలిసిన ఆగని బిజెపి జోరు

Bjpnews : ఠాక్రేలు కలిసిన ఆగని బిజెపి జోరు

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

మహారాష్ట్రలో( Maharashtra) మరోసారి బిజెపి విశ్వరూపం చూపించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బిజెపి ప్రభంజనం సృష్టించింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో సహా మెజార్టీ స్థానాల్లో బిజెపి కూటమి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ముంబైలోని మొత్తం 227 వార్డులకు గాను.. మెజారిటీ స్థానాల్లో తన పట్టు కొనసాగించింది బిజెపి, దాని మిత్రపక్షాలు. మరోవైపు 29 మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో.. బిజెపి దాని మిత్రపక్షాలు 25 చోట్ల నిర్ణయాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాయి. నిజంగా ఇది ప్రభంజనమే. ఎందుకంటే శివసేన పార్టీలో వారసత్వ రాజకీయాలు కొలిక్కి వస్తున్న తరుణంలో.. బిజెపికి ప్రతికూలత తప్పదన్న సంకేతాలు వచ్చాయి. ఇటువంటి సమయంలోనే భారతీయ జనతా పార్టీ ఈ ఘన విజయాన్ని అందుకుంది.

 పూణే తో( Pune) పాటు పింప్రి, చించువాడ్ మున్సిపల్ ఎన్నికల్లో శరద్ పవర్, అజిత్ పవర్ వర్గాలు కలిసి పనిచేసినా అక్కడ ఓటర్లు వారిని ఆదరించలేదు. పూణేలో పవర్ బ్రాండ్ పనిచేయలేదు. మునుపటి ప్రభావం చూపలేకపోయారు. ఈ ఎన్నికలతో భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర ప్రజలు పూర్తి విశ్వాసం ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ప్రదర్శించారు. ముంబై ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ఈ ఫలితాలు నిరూపించాయి. భావోద్వేగ రాజకీయాలను కాకుండా సౌకర్యాలు, అభివృద్ధిని ప్రజలు ఎంచుకున్నారు.

 * మంచి ఫలితాలు..

 భారతీయ జనతా పార్టీకి( Bhartiya Janata Party) ఈ ఫలితాలు ఒక టానిక్ లా పని చేశాయి. ముంబై మౌలిక సదుపాయాల మెరుగుదల, మెట్రో పనుల వేగం కూటమికి కలిసి వచ్చింది. ముఖ్యంగా మహా వికాస్ అఘాడీలోని అంతర్గత విభేదాలు కలిసి వచ్చాయి భారతీయ జనతా పార్టీ కూటమికి.పూణేలాంటి నగరాల్లో వారి ప్రయత్నం వికటించింది కూడా.

 * ప్రభావం చూపని విపక్ష కూటమి..

 కొద్ది నెలల కిందట మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది మహా వికాస్ ఆఘాడి( mahavikas Agadi ). ఎంత మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి బిజెపి కూటమికి గట్టి దెబ్బ తీయాలని భావించింది. కానీ అది ఎంత మాత్రం ప్రభావం చూపలేదు. భారతీయ జనతా పార్టీ కూటమికి ఘనవిజయం దక్కింది. ప్రతిపక్షాల పట్ల ప్రజలు ఆదరణ చూపలేదు. మరోసారి మహారాష్ట్ర బిజెపికి పట్టుకొమ్మ అని తేలిపోయింది.

Share to...