🚨 బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పతనం ఖాయం – సమయమే ప్రశ్న
ఇది భావోద్వేగం కాదు. ఇది శక్తి సమీకరణాల వాస్తవం.
భారత్ ఇకపై బంగ్లాదేశ్‌కి టూర్ చేయదు.
భవిష్యత్తులో బంగ్లాదేశ్ ఆటగాళ్లకు IPL ద్వారాలు మూసుకుపోతాయి.
ఈ బహిష్కరణ వల్ల ICC BCB మీద పెనాల్టీ వేస్తుంది, ICC నుండి నిధులు తగ్గే అవకాశం స్పష్టంగా ఉంది.
అసమతుల్యమైన బోర్డు కారణంగా ICC టోర్నమెంట్ల నిర్వహణ అసాధ్యం.
అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లకు అవకాశాలు తగ్గిపోతాయి.
BCCIతో సంబంధాలు చెడిపోకూడదనే ఉద్దేశంతో ప్రముఖ విదేశీ ఆటగాళ్లు BPLకి దూరంగా ఉంటారు.
ఇదిలా ఉండగా మరో పెద్ద ట్విస్ట్.
పాక్ క్రికెట్ బోర్ అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ, “ICC బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్ నుంచి మార్చకపోతే, పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ ఆడదు” అని BCBకి చెప్పాడు.
అదే మాటలపై నమ్మకం పెట్టుకుని BCB, ICCకి ఎదురు తిరిగింది., కానీ ICC స్పష్టంగా అపీల్‌ను తిరస్కరించింది,
ఇక్కడే అసలు అవమానం.
వాగ్దానం చేసినప్పటికీ మొహ్సిన్ నక్వీ పాకిస్తాన్‌ను ఉపసంహరించలేదు., ఇప్పుడు BCB పాకిస్తాన్‌ని కూడా టోర్నమెంట్ నుంచి బయటకు తీయాలని ప్రయత్నిస్తోంది. మొహ్సిన్ నక్వీకి ఫోన్లు, కానీ ఆయన కాల్స్ ఎత్తడం లేదు . ఎక్కడో దాక్కున్నాడట . 😎😤 ఎవడి యుద్ధం వాడు చేసుకోవాలి, అంతే జాని ఎవడు మీదనో ఆధారపడి ఇంకొకరు మీద తొడ కొడితే వాడు సమయానికి తోడు రాకపోతే నువ్వే అవమానము పొందేది…… 🤣
పాపం బంగ్లాదేశ్, కేవలంప్రీమియర్ లీగ్ (BPL) మీద ఆధారపడి ఒక సంవత్సరం కూడా నిలబడలేరు.
ఒక ఏడాదిలో BCB పూర్తిగా కూలిపోతుంది
లేదా యాజమాన్యం మారుతుంది
చివరికి రెండు మార్గాలే:
1️⃣ భారత్‌కు అనుకూలంగా మారి BCCIతో సర్దుబాటు
2️⃣ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నెమ్మదిగా మాయం
ఇక్కడ IF లేదు, BUT లేదు, మధ్యమార్గం లేదు. 🇮🇳
–– ఉపద్రష్ట పార్ధసారధి



