Dekhlenge Saala Lyrical Song: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమాలతోనూ అభిమానులను అలరిస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండంటంతో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్.. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యలు నిర్వహిస్తున్నారు. అయితే అంతకుముందు కమిట్ అయిన సినిమాలను చకచకా పూర్తి చేసి మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలు ఈ ఏడాది థియేటర్లలో సందడి చేశాయి.
ముఖ్యంగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓజీ’ మూవీ అయితే అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. ఈ మూవీలో పవన్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించి తనలో స్వాగ్ తగ్గలేదని నిరూపించారు. ఇక థమన్ ఇచ్చిన మ్యూజిక్ అయితే ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించింది. దీంతో పవన్ కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే రూ.200 కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. ఓజీ కిక్‌లో ఉన్న పవర్ స్టార్ అభిమానులకు దర్శకుడు హరీశ్ శంకర్ మరింత కిక్ ఇచ్చారు. హరీశ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustad Bhagat Singh) మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘దేఖ్‌లేంగే సాలా’ అంటూ సాగే ఈ పాట అభిమానులను ఓ ఊపు ఊపేస్తోంది.
ఈ పాటలో పవన్ కల్యాణ్ డ్యాన్స్ ఇరగదీశారు. అభిమానులు విజిల్ వేసేలా వింటేజ్ స్టైల్ స్టెప్పులతో అదరగొట్టారు. మరోవైపు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం అందించారు. ఇక విశాల్ ధడ్లానీ సాంగ్ పాడారు. దీంతో ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే టీజర్, పోస్టర్లు, పాటలు ఆకట్టుకుంటున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది వేసవి కాలంలో విడుదల చేయనున్నారు.
Setting the dance floor and records on fire 🔥🔥
RECORD BREAKING 20 MILLION+ VIEWS and counting for #DekhlengeSaala ❤🔥
Cult Captain @harish2you‘s Feast 💥
A Rockstar @ThisisDsp Musical ❤️🔥
Sung by @vishaldadlani, @HariPriyaSinger
Lyrics… pic.twitter.com/ibtuwGdBE0— Ustaad Bhagat Singh (@UBSTheFilm) December 14, 2025



