Tamil Bigg Boss: ప్రముఖ రియాలిటీ షో తమిళ బిగ్ బాస్ షో వివాదాల నడుమ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ షోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన సీజన్‌లో కంటెస్టెంట్లు హద్దులు మీరి ప్రవర్తించడం తీవ్ర చర్చగా మారింది. హౌస్‌మేట్స్ వీజే పార్వతి, కమ్రుద్దీన్ డార్క్ రూమ్‌లో ఏకంగా ముద్దుల్లో మునిగి తేలారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
షోలో భాగంగా పార్వతి, కమ్రుద్దీన్ ఇద్దరు డార్క్ రూంలోకి వెళ్లారు. ముందుగా పార్వతి రూంలోకి వెళ్లగా.. ఆ కాసేపటికే కమ్రుద్దీన్ వెళ్లాడు. దాదాపు గంటపాటు ఇద్దరూ ఏకాంతంగా గడిపారు. ఆ సమయంలో ఇద్దరు ముద్దులు పెట్టుకున్న శబ్దాలు వారి మైకుల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో షో నిర్వాహకులపై నెటిజన్లు మండిపడుతున్నారు. షోలో ఇలాంటి అసభ్యకరమైన పనులకు పాల్పడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాజంపై చెడు ప్రభావం కలిగిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచే ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది.
తొలి నుంచే తమిళ బిగ్ బాస్ షోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈసారి ఏకంగా నిషేధం విధించాలనే డిమాండ్స్ ఊపందుకున్నాయి. అధికార డీఎంకే మిత్రపక్షమైన తమిజ్హగ వజ్వురిమై కట్చి అధినేత, వేల్మురుగన్ బిగ్ బాస్ షోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ షోలో కంటెస్టెంట్లు ప్రవర్తించే తీరు తమిళ సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేసే టాస్కులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. అసహ్యకరమైన దృశ్యాలు యువతను పాశ్చాత్య సంస్కృతి వైపు నడిపిస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఈ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ముద్దు సన్నివేశాలు బయటకు రావడం మరింత రచ్చ రేపుతోంది. తమిళే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ బిగ్ బాస్ షోలు కూడా నిషేధించాలనే డిమాండ్స్ ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి.
channel decided to expose kamravathy couple in the 1 hour cut with a clear audio. 🤭🤭🤭
nation wants to know. 🤣🤣🤣#BiggBossTamil9#bigbosstamil #BiggBoss9Telugu pic.twitter.com/0O5pgezgOH
— 🇮🇳 LITTLE BOY 🇮🇳 (@thala_sinzoo) December 13, 2025



