AKHANDA 2 RELEASE: నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. బాలయ్య నటించిన అఖండ -2 చిత్రం రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ చిత్ర విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూవీని డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. ఈమేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇక ఒకరోజు ముందుగా డిసెంబర్ 11నే ప్రీమియర్స్‌ను ప్రదర్శించబోతున్నారు. సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ కావడంతో బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు.
వాస్తవానికి అఖండ 2 సినిమా ఇప్పటికే థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉండాలి. డిసెంబర్ 5న ఈ మూవీని రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ముందు రోజు రాత్రి టెక్నికల్ కారణాలతో సడెన్‌గా మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్టున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ కాసేపటికే మూవీ విడుదలను కూడా వాయిదా వేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇండస్ట్రీల్లో పెద్ద హీరో అయిన బాలయ్య మూవీనే ఆగిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

అయితే చిత్ర నిర్మాణ సంస్థ14 రీల్స్ ప్లస్ తమకు గతంలో రూ.28 కోట్లు బకాయి ఉందని ఈరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మూవీ విడుదలకు బ్రేక్ వేసింది. ఇండస్ట్రీ పెద్దలు రెండు నిర్మాణ సంస్థలతో చర్చలు జరిపి సమస్యను కొలిక్కి తెచ్చారు. ఎట్టకేలకు చర్చలు ఫలించడంతో మద్రాస్ హైకోర్టుకు సమస్య పరిష్కారం అయిందని నివేదించారు. దీంతో మూవీ విడుదలకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో మరో రెండు రోజుల్లో థియేటర్లలో అఖండ తాండవం సందడి చేయనుంది.



