Home » Latest » “అరిస్తే చరుస్తా.. చరిస్తే కరుస్తా”: మోహన్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన అసెంబ్లీ రౌడీ

“అరిస్తే చరుస్తా.. చరిస్తే కరుస్తా”: మోహన్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన అసెంబ్లీ రౌడీ

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

Subramanyam Dogiparthi: అందమైన వెన్నెల లోన అచ్చ తెలుగు ఆడపడుచు వలె మల్లె పూల పందిరి లోకి నడిచిరావె సరిగమలా . 1991 మార్చిలో , అంటే 35 సంవత్సరాల కింద ఇదే రోజుల్లో , వచ్చిన ఈ అసెంబ్లీ రౌడీ సినిమా అనగానే ముందుగా పాటల్లో గుర్తుకొచ్చే పాట ఇదే . చాలా శ్రావ్యమైన పాట . దర్శకుడు బి గోపాల్ చిత్రీకరణ కూడా బాగుంటుంది . 

మోహన్ బాబు అదృష్టవంతుడు . ఈ సినిమా ఆయన స్వంత బేనర్లోనే వచ్చింది . అసెంబ్లీ రౌడీ అనే టైటిలుకు ఇప్పుడయితే బహుశా సెన్సార్ వారు సర్టిఫికెట్ కూడా ఇచ్చే వారు కాదేమో ! అప్పటికీ ఆరోజుల్లో అసెంబ్లీలో గట్టిగానే చర్చించబడిందని గుర్తు నాకు . మరో అభ్యంతరం కూడా వచ్చేది ఇప్పుడయితే . పంతులూ పంతులూ పావు శేరు మెంతులు అంటూ ఓ బ్రాహ్మణ పురోహితుడిని ఆట పట్టించే పాట ఉంది . ఇప్పట్లో అయితే ఒక వేళ సెన్సార్ అయినా ఆ పాటను తీసేయక తప్పేది కాదేమో !! 

సినిమా విజయానికి కారణం కధ , పరుచూరి బ్రదర్స్ డైలాగులు , మోహన్ బాబు డైలాగ్స్ డెలివరీ , దివ్యభారతి గ్లామర్ . కధ క్రెడిట్ తమిళ మాతృక అయిన సత్యరాజ్ , గౌతమిల సినిమాకు దక్కుతుంది . మోహన్ బాబు ఇమేజికి తగ్గట్లు అరిస్తే చరుస్తా చరిస్తే కరుస్తా వంటి పదునైన డైలాగులు ప్రేక్షకులకు బాగా ఎక్కాయి .

ఓ ఊళ్ళో బాషా అనే రౌడీ . ప్రతిఘటన సినిమాలో కాళీ గారు లాగా . ఆ సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా హీరోయిన్ జాకెట్ కూడా తీసేస్తాడు విలన్ బాషా . ఆ దుష్టులను శిక్షించేందుకు పని కల్పించుకుంటాడు హీరో మోహన్ బాబు . రౌడీలతో జరిగిన ఘర్షణలో హత్యానేరం మోపబడి జైలుకు వెళ్ళవలసి వస్తుంది . 

ఓ లాయర్ గారి ఐడియా ప్రకారం జైల్లో నుంచి అసెంబ్లీకి పోటీ చేయటం , ఓ వృధ్ధుడు ధైర్యం చేసి ప్రాణాలకు తెగించి పోలింగ్ బూతుకు రావటం , శివాజీ నిర్దోషి అని ఓటుతో పాటు స్లిప్పులను వేయటం , శివాజీ ఎలక్షన్లలో గెలవటం తప్పకుండా వినూత్న ఆలోచనే . బహుశా ఈ సినిమా లోనే ఇలాంటి మలుపు ఉండటం . 

మోహన్ బాబుతో పాటు సీనియర్ నటులయిన జగ్గయ్య , గొల్లపూడి మారుతీరావు , అన్నపూర్ణమ్మ , బ్రహ్మానందం , ఆహుతి ప్రసాద్ , ప్రసాద్ బాబు , నర్రా , పాకీజా , మాడా , తదితరులు నటించారు . టివిలో వార్తలు చదివే పాత్రలో రోజారమణి తళుక్కుమంటుంది .బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , చిత్రలు పాటల్ని చాలా శ్రావ్యంగా పాడారు . జాలాది వ్రాసిన తూరుపు కొండల అగ్గి పుట్టెరా దిక్కులన్నీ ఎరుపెక్కిపోయేరా ఎర్రగా ఉంటుంది . పేకల్లో జోకర్లా , తానాల గదిలోకి తారాజువ్వొచ్చింది పాటలు హుషారుగా ఉంటాయి . 

తరచూ టివి చానళ్ళలో వస్తూ ఉంటుంది . సమకాలీన రాజకీయాల మీద , నాయకుల మీద చెణుకులు పుష్కలంగా ఉన్న ఈ సినిమా మోహన్ బాబుని కలెక్షన్ కింగుని కూడా చేసింది . సినిమా యూట్యూబులో లేదు . టివిలో వచ్చినప్పుడే చూడాలి . It’s an excellent entertainer filled with action, romance .

Share to...