# పవన్ కళ్యాణ్ గారితో యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ భేటీ
# ‘ఒబేసిటీ ముక్త్ భారత్ మిషన్ హెల్తీ భారత్’ యాత్రకు ఉప ముఖ్యమంత్రివర్యులు అభినందనలు
Bharat Today : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మేరఠ్ కు చెందిన 23 ఏళ్ల యంగ్ బైకర్ తాప్పీ ఉపాధ్యాయ గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఒబేసిటీ ముక్త్ భారత్ – మిషన్ హెల్తీ భారత్ పేరిట ఆమె చేపట్టిన బైక్ యాత్ర వివరాలను పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ ప్రజల్లో చైతన్యం నింపేందుకు మార్చి 9, 2025న మేరఠ్ లో బైక్ యాత్ర ప్రారంభించినట్లు తాప్పీ ఉపాధ్యాయ తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 17,400 కిలోమీటర్ల ప్రయాణించి, 500పైగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో యాత్ర విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన 12 రాష్ట్రాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా బుల్లెట్ పై సోలోగా ప్రయాణిస్తూ ప్రజారోగ్యంపై అవగాహన కల్పిస్తున్న తాప్సీ ఉపాధ్యాయను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఆమె యాత్ర చాలా మంది యువతకు స్ఫూర్తిగా నిలవాలని అభిలషించారు. మిషన్ హెల్తీ భారత్ లక్ష్యంతో ఆమె చేపట్టిన సాహసోపేత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.



