Home » Latest » విపత్తు నిర్వహణలో దేశానికే ఆదర్శంగా ఏపీ: అగ్నిమాపక శాఖలో చేరిన అత్యాధునిక శకటాలు, బోట్లు

విపత్తు నిర్వహణలో దేశానికే ఆదర్శంగా ఏపీ: అగ్నిమాపక శాఖలో చేరిన అత్యాధునిక శకటాలు, బోట్లు

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

 Amaravati , Bharat Today: దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను రూ.252.93 కోట్లతో ఆధునీకరిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా తొలిదశలో రూ.18 కోట్ల వ్యయంతో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు, రూ.10 కోట్లతో హై ప్రెషర్ పంప్‌లు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, రూ.2.49 కోట్లతో 50 ఇన్ ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లు, రూ.2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను అగ్నిమాపక శాఖ కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్ నుంచి నూతన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విపత్తు సమయాల్లో ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేలా కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలని…కేంద్ర పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని శాఖను బలోపేతం చేయాలని సిబ్బందికి, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. 

Share to...