జన గణనలోనే బీసీల లెక్కలు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా నాగరాజు
భారత్ టుడే , అమరావతి: సుదీర్ఘ పోరాట ఫలితంగా దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం జన గణనలో సమగ్ర కుల గణన చేపడుతామని గ తేడాది ఏప్రిల్ 30న నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఏప్రిల్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా జన గణన చేపడుతూ బీసీ కుటుంబాలను మాత్రం లెక్కించకపోవడం అన్యాయం, జన గణనకు 33 ప్రశ్నలతో నోటిఫికేషన్ విడుద ల చేసిన కేంద్రం ఎస్సీ ఎస్టీ కుటుంబాలను లెక్కించాలని పేర్కొని బీసీల గురించి ప్రస్తావించకపోవడం బాధాకరం. దేశవ్యాప్తంగా జనగణనలో ఎస్సీ ఎస్టీ మాదిరిగానే బీసీ కుటుంబాల లెక్కలు నమోదు చేయాలి. అలా చేయకపోవడం అన్యాయం బీసీల ఓట్లు అయితే కావాలి బీసీ కులగణన మాత్రం చేయరు. ఇదేనా మోడీ గారు మీరు చూపిస్తున్న బీసీల మీద ప్రేమనా, లేకపోతే కపట ప్రేమనా మీరు బిసీ అయ్యి ఉండి బీసీ కులగణన చేయకపోవడం చాలా దారుణం. ఇప్పటికైనా ఆలోచించి దశాబ్దాల పాటు ఉద్యమాలు చేస్తున్న బీసీ నాయకులు మీద బీసీ బిడ్డల మీద బీసీల మీద ప్రేమ లేదా బీసీల ఓట్ల మీదేనా ప్రేమ మీకు ,మీరంటే గౌరవ అభిమానం ఉన్నాయి వాటిని పోగొట్టుకోవద్దండి మీరు చేయనట్లయితే బీసీల ద్రోహిగా మిగిలిపోతారు.. దయచేసి ఆలోచించి మంచి నిర్ణయం త్వరలో తీసుకుంటారని ఆశిస్తున్నాం లేనట్లయితే దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉవేత్తున ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయి దయచేసి బీసీ కులగణాలను గెజిట్ నోటిఫికేషన్ లో పెట్టండి.. అంటూ నాగరాజు డిమాండ్ చేశారు.



