Bharat today : అనంతపురంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక సందడి చేశారు. ఉరవకొండ ప్రాంతంలో రణబలి చిత్రం షూటింగ్ చిత్రీకరణ కోసం దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక వచ్చినట్లు సినీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అనంతపురంలోని తపోవనం కూడలి నుంచి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు బైక్ ర్యాలీ ద్వారా నగరంలో ప్రదర్శన చేపట్టారు. విజయ్ రష్మికను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫోటోలు దిగటానికి పోటీపడ్డారు. హౌసింగ్ బోర్డు కాలనీ లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో విజయ్, రష్మిక ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి రాప్తాడు ప్రాంతంలోని ఓ హోటల్ కు చేరుకున్నారు. అభిమానులకు అభివాదం చేస్తూ నగరంలో విజయ రష్మిక సందడి చేశారు.



