Home » Business » PassiveIncome: కోటి రూపాయలు సంపాదించడం ఎలా ?

PassiveIncome: కోటి రూపాయలు సంపాదించడం ఎలా ?

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

మ‌న శ‌రీరం ఆరోగ్యం ఉండ‌డం ఎంత ముఖ్య‌మో అదే క్ర‌మంలో మ‌నం ఆర్థికంగా కూడా ఆరోగ్యంగా ఉండ‌డం చాలా ముఖ్యం. అయితే ఆర్థిక ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో అనేది చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. మ‌న ఖ‌ర్చులు, ఆదాయం, అవ‌స‌రాలు వీటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అవ‌గాహ‌న‌తో మెలిగితే ఇది సాధ్య‌మేన‌ని నిపుణులు చెప్తున్నారు.

కొత్త ఏడాదిలో ఆర్థిక భారం త‌గ్గించుకుని ఆర్థికారోగ్యంపై దృష్టి పెట్టాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఖర్చులను ముందే ప్లాన్ చేసుకోవాలి. అవశ్యకతకు మించి ఖర్చు చేయకూడ‌దు. పెరుగుతున్న పెట్టుబడులపై జాగ్రత్త వహించాలి. రిటైర్మెంట్, ఇన్సూరెన్స్, NPS వంటి పొదుపు మార్గాల్లో స్థిర పెట్టుబడులు చేయాలి. ఆర్థికారోగ్యం పై శ్రద్ధ వ‌హించాలి.

స్థిరమైన ఆదాయం, అప్పుల నిర్వహణ, నాణ్యమైన పెట్టుబడుల ఎంపిక ముఖ్యం. అత్యవసర నిధులు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇబ్బందుల సమయంలో తక్షణ అవసరాలకు సులభంగా వాటిని వినియోగించుకోవ‌చ్చు.

మన ఆర్థిక పరిస్థితి సురక్షితం, స్థిరంగా ఉండడాన్ని ఆర్థికారోగ్యం అంటారు. ఖర్చులు, ఆదాయం, రుణాలు, పొదుపు, పెట్టుబడులు సమతుల్యతగా ఉండడం ద్వారా మనం ఆర్థిక ఒత్తిడి లేకుండా జీవించగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. అందుకే ప్ర‌తిఒక్క‌రూ ఆదాయానికి తగ్గుగా ఖర్చు చేయాలి.

సురక్షిత మార్గాల్లో పొదుపు చేయాలి. అత్యవసర నిధులు సిద్ధం చేసుకోవాలి. ఆర్థికారోగ్యం (Reduce Financial Burden in the New Year) మానసిక ప్ర‌శాంతత, భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది.

ఆర్థికారోగ్యాన్ని(Financial Health) కాపాడుకోవడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నూత‌న‌ సంవత్సరంలో ప్ర‌శాంతంగా ముందుకు వెళ్లవచ్చు. అధిక వడ్డీల భారం నుంచి బయటపడాలి. నిర్దిష్ట ఆర్థిక తనిఖీ చేయాలి. ఇది ఆరోగ్య పరీక్షలా ఉంటుంది. ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు, రుణాలు అన్నింటినీ సమీక్షించాలి. ఈ ఆర్థిక తనిఖీ ద్వారా కొత్త ఏడాదిని ఆర్థికంగా సురక్షితం, ఆనందంగా ప్రారంభించవచ్చు

కొత్త ఏడాది ప్రారంభంలో ఆర్థికారోగ్యాన్ని మెరుగుపరచడానికి ముందు అప్పుల‌ను స‌మీక్షించుకోవాలి. ఈ మేర‌కు అన్ని రుణాలను లెక్కించాలి. గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ బాకీలపై స్ప‌ష్ట‌త పొందాలి.

అప్పుల వివ‌రాలు రాసుకోవాలి..

రుణ వివరాలను రాసుకోవాలి. వడ్డీ రేటు ఎంత ఉంది? నెలవారీ EMI ఎంత చెల్లిస్తున్నాం? మిగిలిన వ్యవధి ఎంత? అనేది తెలుసుకుంటే ఏ రుణాన్ని తొందరగా తీర్చాలి అన్న స్పష్టత లభిస్తుంది.

అప్పులన్నీ ఒక చోట క్రమంగా రాసుకోవడం (Reduce Financial Burden in the New Year) వ‌ల్ల వడ్డీ భారం త‌గ్గుతుంది. ఆర్థిక భద్రత పెరుగుతుంది. మీకు వేర్వేరు చోట్ల చిన్నచిన్న రుణాలు ఉంటే, వాటన్నింటినీ నిర్వహించడం కష్టం. తక్కువ వడ్డీ ఉన్న వ్యక్తిగత రుణం లేదా ఆస్తిపై తనఖా రుణం తీసుకోవచ్చు. ఇది పది రకాల EMI గందరగోళంను తొలగిస్తుంది. ఒక్క EMI చెల్లించడం ద్వారా సులభంగా అన్ని రుణాలను నిర్వహించవచ్చు. చిన్న చిన్న రుణాలను ఒక్కచోట సమీకరించడం, ఆర్థిక భద్రతకు , సులభమైన ఫండ్ మేనేజ్మెంట్‌కు ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

* ఆర్థికారోగ్యాన్ని (Financial Health)సురక్షితం చేసుకోవాలంటే, అప్పుల జాబితాలోని అధిక వడ్డీ రుణాలను గుర్తించడం అత్యంత అవసరం. సాధారణంగా క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, బై నౌ పే లేటర్‌ (BNPL) పథకాలు అత్యధిక వడ్డీ రేట్లతో (18–40%) ఉంటాయి. మీ దగ్గర ఉన్న మిగిలిన నిధులతో ముందుగా ఈ అధిక వడ్డీ రుణాలను తీర్చేయాలి. దీంతో మీకు వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది. మిగతా రుణాలను సులభంగా నిర్వహించవచ్చు.

* చాలామందికి కనిపించని ఆర్థిక సమస్య క్రెడిట్ కార్డు బాకీ .ఇది నెమ్మదిగా అప్పుల ఊబిలోకి నెట్టివేస్తుంది.మొత్తం బాకీని వీలైనంత త్వరగా తీర్చేయాలి. డబ్బులు లేకపోతే.. తక్కువ వడ్డీతో వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉంటే, ఓవర్‌ డ్రాఫ్ట్ ద్వారా క్రెడిట్ కార్డు బాకీని తీర్చడం ఉత్తమం. దీనివ‌ల్ల మీ వడ్డీ భారం తగ్గుతుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గి, నిధుల సమర్థవంతమైన నిర్వహణ సాధ్యమవుతుంది.

* ఏడాది చివర లేదా పండుగల సమయంలో వచ్చే బోనస్, ఇన్సెంటివ్ లను విలాసాలకు వాడకుండా.. అప్పులను తీర్చేందుకు ఉపయోగించడం ఉత్తమం. గృహరుణం, వాహన రుణం వంటి దీర్ఘకాలిక రుణాల్లో కొంత మొత్తం ముందస్తుగా చెల్లించాలి. ఇది అసలు రుణాన్ని తగ్గిస్తుంది. దీంతో భవిష్యత్తులో వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది. ఇలాంటి ముందస్తు చెల్లింపులు ఆర్థిక ఆరోగ్యానికి మూలస్తంభంగా ఉంటాయి.

* అప్పులను త్వరగా తీర్చాలని ప్రయత్నించేటప్పుడు అత్యవసర నిధిని మొత్తం వాడకూడదు. అనుకోని పరిస్థితులు వస్తే మళ్లీ రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. 3–6 నెలల ఖర్చుకు సరిపడా డబ్బును పక్కన పెట్ట్టాలి. మిగిలిన మొత్తాన్ని మాత్రమే రుణాలు తీర్చడానికి వాడాలి. కొత్త ఏడాదిలో (Reduce Financial Burden in the New Year) అప్పులు చేయకుండా ఉండటం నిజమైన ఆర్థిక విజయం. పాత బాకీలు తీర్చడం ద్వారా, 2026లో ఆర్థిక ప్రయాణం సాఫీగా సాగుతుంది. అత్యవసర నిధిని రక్షించడం , ఖర్చులను నియంత్రించడం, అప్పులను సమర్థవంతంగా తీర్చడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చు.

Share to...