Home » Andhra Pradesh » YSJagan: జగన్ ఫోటో తొలగించాలంటే రూ.70 కోట్లు కావాల్సిందే!

YSJagan: జగన్ ఫోటో తొలగించాలంటే రూ.70 కోట్లు కావాల్సిందే!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీపై గత ఎన్నికల్లో వ్యతిరేకత పెంచడానికి ప్రధాన కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అప్పటివరకు పట్టాదారు పాసుపుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర ఉండేది. కానీ దానిని తొలగించి తన బొమ్మ వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సొంత పార్టీ శ్రేణులు వద్దన్నా వినలేదు. రాజకీయ ప్రత్యర్థులు అభ్యంతరం చేసినా లెక్క చేయలేదు. చివరకు ప్రభుత్వంలో కీలక అధికారులు వద్దని మొత్తుకున్నా వినలేదు జగన్మోహన్ రెడ్డి. దానికి 2024 ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత భయపెట్టిందో.. అంతలా వచ్చింది ఆ ఎన్నికల్లో ఫలితం.

 రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా తన ఫోటో ఉండాలి అనుకోలేదు. కానీ తొలిసారిగా జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy) ఆ కోరిక పుట్టింది. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ఏకంగా పట్టాదారు పాస్ పుస్తకాలపై తన ఫోటో వేయించుకున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ ఫోటోలను ముద్రించుకున్నారు. అంతటితో ఆయన దాహం తీరలేదు. సమగ్ర భూ సర్వే పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రక్రియను చేపట్టారు. చివరకు రైతుల భూములకు వేసే సరిహద్దు రాళ్లపై కూడా తన ఫోటోలను వేసుకునేందుకు వెనుకడుగు వేయలేదు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన ఉద్దేశం ఏమిటో తెలియదు కానీ.. ప్రజల్లోకి మాత్రం వ్యతిరేక భావన వెళ్ళింది. ఈ విషయంలో టిడిపి కూటమి సక్సెస్ అయింది. గ్రామీణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తమ భూములు పోతాయి అన్న బెంగ వారిని వెంటాడింది. అందుకే ఆ పార్టీని దారుణంగా ఓడించారు గ్రామీణ ప్రజలు.

 అయితే అయిందేదో అయిపోయింది.. ఇంతటితో విడిచిపెడతాం అంటే కుదరదు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ( land tight Ling act )ద్వారా జగన్మోహన్ రెడ్డి పై వ్యతిరేకత వ్యక్తం అయ్యేలా కూటమి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఫోటోలను తొలగించి.. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలంటే 70 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలట. ఇప్పుడు దీనినే హైలెట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. నిన్ననే మంత్రివర్గ సమావేశం జరిగింది. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో గురించి చాలామంది మంత్రులు ప్రస్తావించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారే తప్ప.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఎందుకు ఇవ్వలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నట్లు కొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎం చంద్రబాబు స్పందించారు. ఎంత ఖర్చైనా పట్టాదారు పాసుపుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర వేసి.. కొత్తవి అందించాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇప్పుడు ఈ ఖర్చుపై చర్చ జరుగుతోంది. టిడిపి కూటమి ప్రభుత్వానికి కావాల్సింది అదే.

 గతంలో సర్వే రాళ్లపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలను తొలగించడానికి ఇలానే కోట్లాది రూపాయలు ఖర్చు అయింది. అప్పుడు కూడా అదే మాదిరిగా రచ్చ నడిచింది. ఇప్పుడు కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల జారీ చేయాలి అంటే కనీసం 70 కోట్ల రూపాయలు అవసరం. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి స్వార్థం మూలంగా జరిగిన దుర్వినియోగం అంటూ కూటమి ప్రచారానికి ఒక ప్రచార అస్త్రం దొరికింది.

 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి పాలిట శాపం. టిడిపి కూటమి పట్ల వరం. ఇది ప్రూవ్ అయింది కూడా. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను 2029 ఎన్నికల వరకు ఇలానే వినియోగించుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు చర్యలను చంద్రబాబు సర్కార్ సరిదిద్దుతోంది. అది ప్రజల్లో చర్చకు వస్తోంది. గతంలో సర్వే రాళ్లపై జగన్మోహన్ రెడ్డి ఫోటోను తొలగించేందుకు ప్రతి జిల్లాలో కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలపై ఆయన ఫోటో తొలగించి కొత్త పుస్తకం ఇవ్వాలంటే కూడా అదే స్థాయిలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే.

Share to...