Home » Andhra Pradesh » ఉరవకొండలో ఘనంగా శ్రీ ఎర్రితాత స్వామి రథోత్సవం

ఉరవకొండలో ఘనంగా శ్రీ ఎర్రితాత స్వామి రథోత్సవం

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని వై. రామాపురం గ్రామంలో వెలసిన శ్రీ ఎర్రితాత స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా నలుమూలలతో పాటు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథాన్ని భక్తులు గ్రామ వీధుల గుండా లాగుతూ భక్తి పారవశ్యంలో పాల్గొన్నారు. ఈ రథోత్సవ వేడుకలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించగా పై నుంచి కనిపించిన దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Share to...