శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు బాలికల బీసీ హాస్టల్ నందు వెల్ఫేర్ ఆఫీసర్ సులోచన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు జ్ఞానవంతులుగా శక్తివంతులుగా మారాలి అంటే రెండు గంటలసేపు ప్రాణాయామం ద్వారా ప్రకృతి శక్తులను పొందినప్పుడే అధిక జ్ఞాన సంపన్నులుగా మారగలరని , ఏకాగ్రత వస్తుందని మనసును నియంత్రించగలిగే శక్తి పెరుగుతుందని తెలియజేశారు విద్యార్థులు మనసును నియంత్రించలేక ఎన్నో బాధలు పడుతున్నారని గుర్తు చేశారు అన్నం ద్వారా ప్రాప్తించిన పరబ్రహ్మ శక్తిని అనవసరమైన కార్యాలకు వృధా చేయరాదని గుర్తు చేశారు. అలా చేస్తే పరబ్రహ్మను నిర్లక్ష్యం చేసిన వారు అవుతారని తద్వారా అనేక కష్టనష్టాలకు గురి అవుతారని తెలియజేశారు. తదనంతరం విద్యార్థులతో ప్రాణాయామం ఎలా చేయాలి? విశ్వశక్తిని ఎలా పొందాలి అన్న టెక్నిక్స్ ను నేర్పించారు.
నిత్యం ప్రాణాయామం.. టాపర్స్ మీరే
Tags:
Concentration DrBhaskarNaidu EducationTips Kothacheruvu Pranayama SriSathyaSaiDistrict YogaForStudents
Related News



