హెల్మెట్ ధరించండి భారం కాదు బాధ్యత అని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ చిన్న గోవిందు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలంలోని ధనలక్ష్మి నగర్‌లో గల భాష్యం స్కూల్ విద్యార్థులు హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం మానవ హారం నిర్వహించడం జరిగిందని వివరించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని తిరుపతి రూరల్ పోలీస్ సిబ్బంది నిర్వహించడం జరిగిందన్నారు. హెల్మెట్ భారం కాదు బాధ్యత అని వివరించారు. ఇటీవల కాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాల నివారణ కోసం హెల్మెట్ ఒక రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ వాడాలని తెలిపారు. ప్రమాదాల నివారణ కోసం అందరం సంఘటితంగా కృషి చేస్తామన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణరక్షణకు హెల్మెట్ ఎంతగానో దోహదపడుతుందన్న అంశాలను ప్రజలకు తెలియజేశారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ ధారణపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ, రామకృష్ణ పోలీస్ కానిస్టేబుల్ , విద్యార్థులు పాల్గొన్నారు.
Tirupatinews: హెల్మెట్ ధరించడం భారం కాదు బాధ్యత
Tags:
AndhraPradeshPolice NoHelmetNoPetrol PoliceUpdate RoadSafety TirupatiCrimeNews TirupatiNews TirupatiPolice
Related News



