Home » Andhra Pradesh » కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీమత్ కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు వివిధ వాహనాలపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే ముఖ్య కార్యక్రమాలలో ధ్వజారోహణం, వాహన సేవలు, ప్రత్యేక పూజలు మరియు హోమాలు, స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం ముఖ్యమైనవి. ఈ వేడుకల సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం పొందుతూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై సూర్యనారాయణుడు అవతారంలో స్వామివారు భక్తులకు అంగరంగ వైభవంగా దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం పరిసరాలు భక్తులతో కళకళలాడుతూ భక్తి మయమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Share to...