తాము చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత సహాయం చేయాలి అన్న ఆలోచనను పూర్వ విద్యార్థులు నెరవేర్చి చూపారు. కదిరి నియోజకవర్గంలోని కుటాగుళ్ల హై స్కూల్ విద్యార్థులు మంచినీటి సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు స్పందించారు. ప్రత్యేకంగా బోరు బావి తవ్వించి విద్యార్థులకు నీటి సౌకర్యం కల్పించారు. మాకు విద్యాబుద్ధులు నేర్పి , మేము ఉన్నతంగా జీవించేందుకు తోడ్పడిన పాఠశాల రుణం తీర్చుకునే అవకాశం రావడం ఆనందంగా ఉందని ఇదే పాఠశాలలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
Kadiri : పూర్వ విద్యార్థుల ఔదార్యం
Related News



