Home » Andhra Pradesh » CMRamesh: అమిత్ షా కోర్ టీం లోకి సీఎం రమేష్ .. ఢిల్లీ బిజెపిలో కి రోల్ !

CMRamesh: అమిత్ షా కోర్ టీం లోకి సీఎం రమేష్ .. ఢిల్లీ బిజెపిలో కి రోల్ !

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

సీఎం రమేష్( CM Ramesh).. పరిచయం అక్కర్లేని పేరు ఇది. సీనియర్ రాజకీయ నేతగా సుపరిచితులు. సుదీర్ఘకాలం రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలో చేరి ప్రస్తుతం లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. అయితే కేంద్ర పెద్దల వద్ద రోజురోజుకు సీఎం రమేష్ పరపతి పెరుగుతోంది. బిజెపి పెద్దలతో సన్నిహిత సంబంధాలు మరింతగా పెరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షావద్ద పలుకుబడి అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏ కమిటీ లో అయినా సీఎం రమేష్ ఉండి తీరాల్సిందే అన్నట్టు పరిస్థితి ఉంది. ఏకంగా జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా సీఎం రమేష్ సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కూడా పదవి ఇచ్చారు. మరో రెండు మూడు కమిటీల్లో సభ్యుడు కూడా ఆయన ఉన్నారు.

* రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు..

 ఎక్కడో రాయలసీమ( Rayalaseema) నుంచి వచ్చి ఉత్తరాంధ్రలో పోటీ చేసి గెలిచారు సీఎం రమేష్. పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న నియోజకవర్గం అది. అటువంటి నియోజకవర్గంలో నెగ్గి బిజెపిలో కీలక నేతగా మారారు. ఏపీ బీజేపీ అంటే ప్రముఖంగా ఆయన పేరు వినిపించే స్థాయికి చేరారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వచ్చిన ప్రతిసారి సీఎం రమేష్ కు అత్యంత ప్రాధాన్యత దక్కుతోంది. గతంలో విశాఖ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు సీఎం రమేష్ హవా బాగా కనిపించింది. ప్రధాని నరేంద్ర మోడీని స్వాగతం పలుకుతూ సభలోనే ప్రసంగం చేశారు సీఎం రమేష్. బిజెపికి చెందిన అనేక ఇతర నేతలు ఉన్నప్పటికీ.. సీఎం రమేష్ కి ఆ అవకాశం ఇవ్వడం ద్వారా బిజెపి పెద్దలు ఆయనకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం అవుతోంది. 

* సామాజిక సమీకరణలతో..

 ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు గెలిచారు. అనకాపల్లి( Anakapalli) నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురందేశ్వరి, నరసాపురం నుంచి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ విజయం సాధించారు. సామాజిక సమీకరణలు కుదరక కేంద్రమంత్రి పదవి సీఎం రమేష్ కు దక్కలేదు. లేకపోతే కేంద్ర క్యాబినెట్లో ఆయనకు తప్పకుండా స్థానం ఇవ్వాల్సి ఉంది. అయితే ఆయనకు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా క్యాబినెట్ బెర్త్ తో కూడిన పదవి ఇచ్చినట్లు అయ్యింది. బిజెపికి ఎంతో ప్రతిష్టాత్మకంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ లోను సీఎం రమేష్ కు చోటు దక్కింది.

 * నేరుగా సంబంధాలు..

 కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో( home minister Amit Shah ) నేరుగా సంబంధాలు కలిగిన నేత సీఎం రమేష్. ఏపీలో కూటమిపరంగా, భారతీయ జనతా పార్టీ పరంగా ఏ ఆలోచన అయినా ఇప్పుడు సీఎం రమేష్ తోనే చేస్తున్నారు కేంద్ర పెద్దలు. బిజెపి పెద్దలకు ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. అయితే త్వరలో ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖాయమని ప్రచారం నడుస్తోంది. 

 * మాధవ్ నియామకం వెనుక..

 బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్( pvn Madhav) ఎంపిక వెనుక సీఎం రమేష్ ఉన్నారన్నది బహిరంగ రహస్యం. రాజమండ్రి ఎంపీగా గెలిచిన పురందేశ్వరి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండేవారు. ఆమెను మరోసారి కొనసాగిస్తారని ప్రచారం నడిచింది. అయితే అనూహ్యంగా పివిఎన్ మాధవ్ కు ఆ పదవి దక్కింది. దాని వెనుక సీఎం రమేష్ ఉన్నారు. సీఎం రమేష్ అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన నాటి నుంచి ఆయన గెలుపు కోసం కృషి చేశారు మాధవ్. అందుకే మాధవ్ విషయంలో ప్రత్యేక ఆలోచన చేశారు సీఎం రమేష్. ఆ పదవి కోసం విపరీతమైన పోటీ ఉంది ఏపీ బీజేపీలో. కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఉన్న సాన్నిత్యంతో ఈవీఎం మాధవ్ ను నియమించుకున్నారు సీఎం రమేష్. ఇప్పుడు ఏపీ బీజేపీ అంటే కేంద్ర పెద్దలకు కనిపించేది కూడా ఆయనే. అయితే 2019 ఎన్నికల తర్వాత బిజెపిలోకి వెళ్లారు సీఎం రమేష్. కానీ ఈ అనతి కాలంలోనే బిజెపి పెద్దల తలలో నాలుకగా మారారు. మున్ముందు బిజెపిలో సీఎం రమేష్ క్రియాశీలక పాత్ర పోషిస్తారని పొలిటికల్ పండిట్స్ కూడా భావిస్తున్నారు.

Share to...