బుద్ధిస్ట్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో బుద్ధునితో నా ప్రయాణం నాటకాన్ని కడప నగరంలోని హరిత ఫంక్షన్ హాల్ లో ప్రదర్శించారు. అద్భుతంగా సాగిన ఈ నాటకానికి మధ్య ప్రజలు హాజరయ్యారు. నగరంలో ఉన్న ప్రముఖులు విద్యార్థులు మహిళలు చాలామంది హాజరయ్యారు. దుఃఖ నివారణకు, సమాజంలో శాంతి సౌభాగ్యం వెల్లివిరియడానికి బుద్ధిని మార్గాలే శరణ్యమని ఈ నాటకం తెలియజేసింది. ప్రపంచంలో ఈ రోజు జరుగుతున్న యుద్ధాలకు కారణం మితిమీరిన దురాశ, దీన్ని అంతం చేయకుండా సమాజంలో శాంతి రాదని ఈ నాటకం ద్వారా తెలియజేశారు. బౌద్ధం భారతీయ జీవన విధానాన్ని ప్రభావితం చేసింది. బౌద్ధం భారతీయ ప్రజల ఆత్మ అని తెలియజేసిన ఈ నాటకం ఆహూతూలందరిని ఉర్రూతలూగించింది.
నాటకం ప్రారంభంలో బుద్ధుడు అంబేద్కర్ల చిత్రపటాలకు నగరంలోని ప్రముఖులు డాక్టర్ ఓబుల్ రెడ్డి , డాక్టర్ రాజా వెంగళ రెడ్డి , డాక్టర్ రాజేశ్వరమ్మ , డాక్టర్ అశోక్ కుమార్ , సీనియర్ లాయర్ సంపత్ కుమార్, బుద్ధిస్ట్ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు పిళ్లా కుమార స్వామి రెడ్డి , ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ సుదర్శన్ రెడ్డి , శ్రీహరి డిగ్రీ కాలేజ్ చెన్న కేశవరెడ్డి , వివేకానంద డిగ్రీ కాలేజ్ ఉపన్యాసకులు సునీత తదితరులు నివాళులర్పించారు. నాటకం ఆద్యంతం బుద్ధుడి చరిత్రను అంబేద్కర్ ద్వారా సహజ సిద్ధమైన రీతిలో ఆధునిక సాంకేతికతను జోడించి నాటకాన్ని రక్తి కట్టించారు. ఈ నాటకాన్ని తిలకించిన ప్రజలు మంచి నాటకాన్ని ప్రదర్శించారని బుద్ధిష్ట్ కల్చరల్ సొసైటీని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి నాటకాలను మరిన్ని ప్రదర్శించాలని వారు కోరారు.



