ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ ప్రకటించింది. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన చంటి నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ సోమవారం జాబితా విడుదల చేశారు. బిజెపిలో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ పదవులు నిర్వర్తించిన చంటి సేవలను గుర్తించిన బిజెపి రాష్ట్ర నాయకత్వం ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న బీసీల హక్కులు వారి సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేసి బిజెపికి బీసీలలో ఆదరణ తెచ్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా చంటి అన్నారు.



