అనంతపురం జడ్పీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో విధులు నిర్వహిస్తున్నటువంటి 2 టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ పై ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అనుచరుడు మైసూర్ రెడ్డి దుర్భాషలాడడం చాలా బాధాకరమని కదిరి డివిజన్ యాదవ సంఘం నాయకులు, బీసీ సంఘం నాయకులు తెలిపారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రోటోకాల్ మేరకు 2 టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ తమ విధులు నిర్వహిస్తూ ఉంటే ఆ విధులకు ఆటంకం కలిగిస్తూ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అనుచరుడు మైసూరా రెడ్డి అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తునామ్ అన్నారు. మైసరా రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే శ్రీకాంత్ యాదవ్ ని క్షమాపణ అడగాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ విషయాన్ని అనంతపురం కలెక్టర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి ఆందోళన చేపడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BC ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి చింతా నాగరాజు గారు, కదిరి డివిజన్ యాదవ సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీరామ్ యాదవ్ వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు యాదవ్, నాయకులు సుధాకర్ యాదవ్, రామచంద్ర యాదవ్,కటారి రెడ్డి యాదవ్ రామ్మోహన్ యాదవ్, లక్ష్మీపతి యాదవ్, నరేంద్ర యాదవ్ మరియు శ్యాంప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ క్షమాపణ చెప్పాలని బీసీ సంఘాల డిమాండ్
Tags:
Related News



