Home » Andhra Pradesh » Army: ఆర్మీ యుద్ధ వీరులకు ఘన సన్మానం

Army: ఆర్మీ యుద్ధ వీరులకు ఘన సన్మానం

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

అనంతపురం జిల్లా మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షులు కెప్టెన్ దూదేకుల శేకన్న ఆధ్వర్యంలో 1965, 1971 యుద్ధాలలో పాల్గొన్న మాజీ సైనికులకు నిర్వహించిన సన్మానం కార్యక్రమం ఘనంగా జరిగింది. 1971లో డిసెంబర్ 3 నుంచి 16 వరకు”ఆపరేషన్ విజయ్” పేరుతో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ను ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు భారత్ కృషి చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు వారి అనుభవాలను సభ్యులతో పంచుకున్నారు. సన్మానించబడిన వారిలో 1965లో యుద్ధంలో పాల్గొన్న సూపర్ సీనియర్ మాజీ సైనికులు పి.సిద్ధన్న, పి. గోవింద్ రెడ్డి, డి. రామచంద్రారెడ్డి, జి. నాగభూషణం, బాబా రత్నం, వసంతులు ,ఎం.నంజె గౌడ, సి.కల్లప్ప , 1971 యుద్ధంలో పాల్గొన్న కెప్టెన్ షేకన్న, అబ్దుల్ ఖాదర్, కాజా సాహెబ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ తిమ్మారెడ్డి, ఈశ్వరయ్య ,పెంచలయ్య ,ఈ. రంగారెడ్డి, బిఏ.హుస్సేన్, జంగం శెట్టి సురేష్ తదితరులు పాల్గొ్న్నారు.

 

 

Share to...