Home » Andhra Pradesh » ఉత్తరాంధ్ర పై బిజెపి ఫుల్ ఫోకస్..పీవీఎన్ మాధవ్ ఆలోచన అదే!

ఉత్తరాంధ్ర పై బిజెపి ఫుల్ ఫోకస్..పీవీఎన్ మాధవ్ ఆలోచన అదే!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

ఉత్తరాంధ్ర పై ఫుల్ ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. వచ్చే ఎన్నికల నాటికి ఓట్లతో పాటు సీట్లు పెంచుకునేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో రెండు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంటు స్థానంలో విజయం సాధించింది. అరకు పార్లమెంటు స్థానంలో ఓటమి చవిచూసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణు కుమార్ రాజు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి నడికుదిటి ఈశ్వరరావు గెలిచారు బిజెపి నుంచి. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో రెండు పార్లమెంటు సీట్లతో పాటు కనీసం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని బిజెపి భావిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన బిజెపి రాష్ట్ర చీఫ్ పివిఎన్ మాధవ్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఉత్తరాంధ్ర పరిధిలోని నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తరిస్తున్నారు. తెలుగుదేశం, జనసేనతో సమన్వయం చేసుకుంటూనే సొంతంగా బలపడాలన్న ఆలోచనలో ఉంది భారతీయ జనతా పార్టీ.

* విశాఖలో పట్టు..

ప్రధానంగా విశాఖ నగరంలో భారతీయ జనతా పార్టీకి పట్టు ఎక్కువ. వాస్తవానికి అది ఒక మినీ భారతదేశం. స్టీల్ ప్లాంట్, ఎన్ టి పి సి, బిహెచ్పివి, నావల్ డాక్ యార్డ్, పోర్ట్.. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి. సహజంగా ఉత్తరాది రాష్ట్రాల వారు ఎక్కువగా ఉపాధి, ఉద్యోగాలరీత్యా స్థిరపడ్డారు. అందుకే ఇక్కడ బిజెపి బలంగా కనిపిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి సొంతంగా ఎదిగేందుకు విశాఖను వేదికగా చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. విశాఖ నగర పరిధిలోని అన్ని నియోజకవర్గాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో సింహభాగం రాజకీయ ప్రయోజనాలు దక్కించుకోవాలని చూస్తోంది.

 

* 80 దశకంలోనే మేయర్ పదవి

వాస్తవానికి భారతీయ జనతా పార్టీ టిడిపి కంటే ముందే విశాఖలో జెండా పాతింది. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆ సమయంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. మేయర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. అప్పుడు దేశంలో బిజెపికి ఉన్న ఎంపీలు ఇద్దరు మాత్రమే. ఈ లెక్కన విశాఖలో బిజెపి ప్రభావం ఎలా చూపిందో అర్థం అవుతుంది. మరోవైపు ఉత్తరాంధ్ర పట్టబద్రుల ఎమ్మెల్సీగా పీవీ చలపతిరావు ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర చీఫ్ పివిఎన్ మాధవ్ సైతం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా కంభంపాటి హరిబాబు గెలిచారు. ఎంతటి ఘనచరిత్ర ఉన్న బిజెపి ఉత్తరాంధ్రలో గట్టి ఇం తటి ఘనచరిత్ర ఉన్న బిజెపి ఉత్తరాంధ్రలో గట్టి పట్టు కోసం ఆరాటపడుతోంది.

* శ్రీకాకుళం జిల్లాలో సైతం..

మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో సైతం ఒక స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంది అంటే ఏ స్థాయిలో ఆ పార్టీ పట్టు పెంచుతుందో అర్థం అవుతుంది. అందుకే ఈసారి విజయనగరం జిల్లాలో సైతం ఖాతా తెరవాలని చూస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి ఉత్తరాంధ్ర నుంచి పది అసెంబ్లీ సీట్లతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలపై దృష్టి పెట్టింది. అక్కడ నాయకత్వాన్ని పటిష్ట పరచడంతో పాటు క్యాడర్ను పెంచుకునే పనిలో ఉంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర చీఫ్ పివిఎన్ మాధవ్ కృతనిశ్చయంతో ఉన్నారు. తన సొంత ప్రాంతం ఉత్తరాంధ్రలో సత్తా చాటాలని చూస్తున్నారు.

Share to...