Home » Andhra Pradesh » జగన్ శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్

జగన్ శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

కల్తీ మనస్తత్వంతో పాలన చేస్తే, పరిస్థితి కూడా అదే విధంగా తయారవుతుంది. వైఎస్ జగన్ పాలనలో అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో వందల సంఖ్యలో హిందూ ఆలయాలు, విగ్రహాలు, ఆలయ ఆస్తులపై దాడులు జరిగాయి. తిరుమలలో కల్తీ నెయ్యి లడ్డూ వ్యవహారం ఎంత దారుణంగా వెళ్లిందంటే, చివరకు YSR Congress Party – YSRCP వారు తమంతట తామే రిపోర్ట్ ఇచ్చుకునే స్థాయికి వెళ్లారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మండిపడ్డారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.

పాలు సేకరించలేని డైరీకి నెయ్యి సరఫరా బాధ్యతలు అప్పగించారు. నెయ్యి కాని నెయ్యితో లడ్డూలు తయారు చేసి, కోట్లాది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు. రాష్ట్రంలో అన్యమతస్థుల ప్రాబల్యం పెంచే ఆలోచనతో విధానాలు అమలు చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో నిబంధనలను తుంగలో తొక్కి, అవినీతి అక్రమాలకు ద్వారాలు తెరిచారు.

వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రాజెక్టులన్నింటిలోనూ అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారికే ప్రాధాన్యత ఇచ్చారు. పవిత్రమైన ఆవు నెయ్యి బదులు సింథటిక్ నెయ్యిని వినియోగించి, స్వామివారి నిధులను దుర్వినియోగం చేశారు. దీనికి వారు ప్రజలకు, భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వ నేతృత్వంలో గతంలో జరిగిన అవినీతిపై ప్రక్షాళన చేస్తూ, వ్యవస్థను పునర్నిర్మించే దిశగా ముందుకి సాగుతున్నాము.

భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ప్రజల విశ్వాసాన్ని కాపాడుతూ, కూటమి సమిష్టిగా కృషి చేస్తుంది. అన్ని దేవాలయాల పవిత్రతను కాపాడుతూ, హిందూ మనోభావాలు గాయపడకుండా ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం అని బిజెపి అధ్యక్షుడు మాధవ్ స్పష్టం చేశారు.

Share to...