రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అదేవిధంగా రాజ్యాంగం కల్పిస్తున్న వాక్ స్వాతంత్రాన్ని,లౌకికత్వాన్ని కూడా కాపాడుకోవాలని మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె.చంద్రు తెలియజేశారు.జన విజ్ఞాన వేదిక మరియు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాల్ నందు బార్ కౌన్సిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.గురు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన “రాజ్యాంగ పరిరక్షణ” సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఇంక్విలాబ్ జిందాబాద్ అనేది స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన స్లోగన్. బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం పొందడానికి భారతీయులను ఎంతో ఉత్తేజపరిచిన ఈ వాక్యం పలికిన ఒక వ్యక్తికి ఐదు సంవత్సరాలపాటు జైలు శిక్ష విధించడం చూస్తే మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థమవుతుందని అన్నారు. ఈనాడు మన దేశంలోని ప్రజలు ఎటువంటి బట్ట కట్టాలి,తిండి ఏమి తినాలి వంటి విషయాన్ని కూడా పాలకులు నిర్ణయించే స్థాయికి వచ్చిందని దీన్ని బట్టి చూస్తే మానవుని యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దేశంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ప్రభుత్వ సంస్థల పేర్లను మార్చే ప్రయత్నంలో ఉన్నారని అన్నారు.
Atpnews: రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత
Tags:
BJPAgainstDemocracy Democracy DemocracyNow Freedom IndianDemocracy SaveDemocracy SaveOurDemocracy
Related News



