Home » Andhra Pradesh » JNTU రిజిస్ట్రార్ కృష్ణయ్య ని తక్షణమే తొలగించాలి – ABVP

JNTU రిజిస్ట్రార్ కృష్ణయ్య ని తక్షణమే తొలగించాలి – ABVP

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం 2008ని కాపాడాలని ABVP నాయకులు నల్ల బ్యాడ్జిలు ధరించి అనంతపురం JNTU లో నిరసన చేపట్టారు. అందులో భాగంగా VC ఆచార్య సుదర్శన్ రావు కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అఖిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చట్టంలో 6 సంవత్సరాలకు పైబడి రిజిస్ట్రార్ గా కొనసాగకూడదని స్పష్టంగా ఉంది.  కానీ ప్రస్తుతం రిజిస్ట్రార్ గా ప్రొఫెసర్ కృష్ణయ్య ఇందుకు భిన్నంగా కొనసాగుతున్నారన్నారు. ఈయన గతంలో 13-11-2014 నుంచి 27-05-2019 వరకు(4 సంవత్సరాల 6నెలల 14రోజులు) మళ్ళీ తిరిగి 20-07-2024 నుంచి ప్రస్తుతం ఇప్పటివరకు (1 సంవత్సరం 7 నెలల 3 రోజులు) అంటే మొత్తం 6 సంవత్సరాల 1నెల 17 రోజులు అవుతున్నాయి. అంటే దాదాపుగా 48 రోజులుగా చట్టాన్ని అతిక్రమిస్తూ రిజిస్ట్రార్ గా కొనసాగుతున్నారని ఇది పూర్తిగా ప్రభుత్వ చట్టాన్ని విస్మరించడమే అని తెలిపారు. ఈ విధంగా ప్రభుత్వ చట్టాన్ని అతిక్రమించి రిజిస్ట్రార్ గా ప్రొఫెసర్ కృష్ణయ్య ని కొనసాగించడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.ఈ విధంగా విద్యాబుద్ధులు నేర్పించే విశ్వవిద్యాలయాల్లో చట్టాన్ని అతిక్రమిస్తే విద్యార్థులకు ఏమి బోధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావున తక్షణమే JNTUA ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్యని తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు కన్వీనర్ భరత్,రాష్ట్ర టెక్నికల్ సెల్ కో కన్వీనర్ గణేష్,రాష్ట్ర లా ఫోరం కోకన్వీనర్ నాగార్జున, యూనివర్సిటీ కార్యదర్శి సాయి, జిల్లా కన్వీనర్ శివరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్ నాయక్,గిరి నాయకులు వంశీ,దివాకర్,సందీప్, భరత్,రమేష్ మనోహర్, ఉదయ్, తనోజ్ కుమార్, భరద్వాజ, హితేష్ నాయక్, జయరాం, గణేష్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Share to...